YS Sharmila: వైఎస్ జగన్ ఎన్నటికీ మళ్లీ సీఎం అవ్వరు! సంచలన కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు? భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడు.
Vijayawada, AUG 14: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రారు అని షర్మిల జోస్యం చెప్పారు. వైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదని షర్మిల అన్నారు. ”జగన్ తో కాంగ్రెస్ చర్చలు అనేది అబద్ధం. ఇందులో వాస్తవం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. పిల్ల కాలువలు అన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలవాలి. జగన్ వస్తే బాగుండు అని చెప్పుకుంటున్నారు. జగన్ మళ్ళీ ఎందుకు రావాలో చెప్పాలి. మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పులు చేయడానికి రావాలా?
Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్ళీ రావాలా? మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్ళీ రావాలా? ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతుంటే రిపేర్లు లేవు. ఇందుకే జగన్ మళ్ళీ రావాలా? ధర స్థిరీకరణ నిధి అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి రావాలా? జగన్ మళ్ళీ అధికారంలోకి రారు. వైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు? భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడు. 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు ఒక్క సీటుతో పండుగ చేసుకోండి” అని వైసీపీని ఉద్దేశించి షర్మిల విరుచుకుపడ్డారు.