తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు. రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది.  బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య

ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, వారంతా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)