YS Viveka Murder Case: వైఎస్ అవినాశ్ రెడ్డి కోసం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో సీబీఐ అధికారులు.. సర్వత్రా టెన్షన్.. టెన్షన్

ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

CBI and Avinash Reddy (Photo-File image and Twitter)

Kurnool, May 22: వివేకా హత్య కేసుకు (Viveka Murder Case) సంబంధించి విచారణ కోసం కడప వైసీపీ ఎంపీ (YSRCP MP) వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) కోసం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి (Vishwabharathi Hospital) సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుండెపోటుతో స్థానిక విశ్వభారతి ఆసుపత్రిలో చేరిన అవినాశ్ తల్లి అక్కడే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. వరుసగా మూడోసారి కూడా విచారణకు రాకపోవడంతో ఆయన కోసం సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. హైదరాబాద్, కడప నుంచి సీబీఐ అధికారులు వచ్చారు.

Kerala High Court: సోదరుడి వల్ల గర్భవతి అయిన 15 ఏండ్ల బాలిక.. 7 నెలల గర్భం విచ్చిత్తికి కేరళ హైకోర్టు అంగీకారం

ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కు..

అవినాశ్ కోసం సీబీఐ అధికారులు ఆస్పత్రికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు కడప, పులివెందుల వచ్చిన వైసీపీ కార్యకర్తలే కాకుండా... స్థానిక కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రి గేటు వద్ద బైఠాయించి సీబీఐకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను సీబీఐ అధికారులు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కు తెలియజేస్తున్నారు.

Viral Video: నెమలి ఈకలు ఒక్కొక్కటిగా తొలగిస్తూ మూగజీవికి నరకం చూపించి చంపిన యువకుడు.. మధ్యప్రదేశ్ లో హృదయవిదారక ఘటన.. వీడియో ఇదిగో..



సంబంధిత వార్తలు

Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన