IPL Auction 2025 Live

YSR 75th Birth Anniversary: షర్మిలని గెలిపించడానికి కడపలో గల్లీగల్లీ తిరుగుతా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, జగన్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు

కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసినవారినే వారసులుగా గుర్తించాలని... అది షర్మిల మాత్రమే అన్నారు.

Telangana CM Revanth Reddy

మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ జయంతి సభ నిర్వహించారు.ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ..కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జరుగుతోందని... అదే జరిగితే తాను కడపకు వచ్చి ఊరూరు... గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ కోసం, షర్మిల కోసం పని చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు చాలామంది వైఎస్ పేరు మీద అన్ని రకాల లబ్ధిని పొందారని విమర్శించారు. కానీ ఆయన ఆశయాలు మోసినప్పుడే వారసత్వం అవుతుందన్నారు. వైఎస్ ఆశయాలను మోసినవారినే వారసులుగా గుర్తించాలని... అది షర్మిల మాత్రమే అన్నారు.

రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలనేది వైఎస్ కల అని, ఆ ఆశయం కోసం పని చేసేవారికి అండగా ఉండాలన్నారు కానీ వైఎస్ పేరు మీద వ్యాపారం చేసేవారు వారసులు అవుతారా? అని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ పేరు మీద వ్యాపారం చేసేవారు వారసులా? లేక ఆయన ఆశయం కోసం పని చేసేవారా? ఆలోచించాలని సూచించారు.  వైఎస్ఆర్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మరోలా ఉండేది, రాహుల్ గాంధీ సంచలన వీడియో ఇదిగో, ఆయ‌న‌ను కోల్పోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటంటూ..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనీసం సర్పంచ్‌ను కూడా గెలుచుకోదని చెబుతారని... అది తెలిసి కూడా షర్మిల బాధ్యత తీసుకున్నారని కితాబిచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోస ఆమె ఈ బాధ్యతలను స్వీకరించారన్నారు. అలాంటి షర్మిలకు తాము నూటికి నూరు శాతం తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఇక్కడకు తనతో పాటు తన మంత్రివర్గం అంతా వచ్చిందని... మీకు అండగా ఉంటామని చెప్పడానికే వచ్చామన్నారు. ప్రతి అడుగుకు సందర్భం వస్తుందని... ప్రజలు మున్ముందు సరైన తీర్పు ఇస్తారన్నారు.

కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నికలు వస్తే ఊరురు తిరిగే బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కడప పౌరుషాన్ని ఢిల్లీకి చూపించే అవకాశమొస్తే తాను గల్లీ గల్లీ... ఇల్లిల్లూ తిరుగుతానన్నారు. ఎక్కడ పొగొట్టుకున్నామో... అదే కడప నుంచి మనం ముందుకు సాగుదామని ధైర్యం చెప్పారు. ఎక్కడైతే దెబ్బతిన్నామో... అదే కడప నుంచి మొదలు పెడదామన్నారు. 2009లో వైఎస్ మరణం తర్వాత షర్మిల ఓదార్పు యాత్రను ప్రారంభించి... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తల కోసం అలుపెరగని కృషి చేశారని కితాబిచ్చారు.

20 ఏళ్ల క్రితం వైఎస్ చేసిన పాదయాత్ర స్ఫూర్తితో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. 1999లో వైఎస్ ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్రను ఈరోజు రాహుల్ గాంధీ లోక్ సభలో పోషిస్తున్నారన్నారు. వైఎస్ అంటే మనకు గుర్తుకు వచ్చేది 'మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేద'ని గుర్తు చేశారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి