YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్ కానుక, జూన్ నెల పెన్సన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు (volunteers) ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను (Social security pensions) అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.
Amaravati, June 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ పెన్షన్ కానుక (YSR Pension Kanuka) పంపిణీ ప్రారంభమయింది. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు (volunteers) ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను (Social security pensions) అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,421.20 కోట్లు విడుదల చేసింది. 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో నిమగ్నమయ్యారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులు పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న పొర్టబిలిటీ ద్వారా పెన్షన్లు అందజేస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,421.20 కోట్ల మొత్తాన్ని పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమచేసింది.ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవి, డయాలసిస్ పేషంట్లకు డీబీటీ విధానంలో పెన్షన్ సొమ్మును జమచేస్తారు.