MLA Gudivada Amarnath: పట్టపగలే మందేశావా.. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తాం, బండారుకు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరిక, గౌతమ్ రెడ్డి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత

పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ (MLA Gudivada Amarnath) మండిపడ్డారు.

MLA Gudivada Amarnath(Photo-Video Grab)

Amaravati, Feb 23: ఏపీ ఐటీ మంత్రి మృతిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ (MLA Gudivada Amarnath) మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఇంతటి మహా విషాదాన్ని తమ పార్టీయే కాక రాష్ట్రమంతా భరించలేకపోతోందని... ఈ దశలో Bandaru ఇంతలా దిగజారి తాగుబోతు మాటలు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.

చంద్రబాబు తమ నాయకుల చేత మరీ ఇంత నీచంగా మద్యం తాగించి మాట్లాడించటం బాధాకరమన్నారు. టీడీపీ (TDP) దిగజారుడుతనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏం ఉంటుందని ప్రశ్నించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి ఏపీలో రూ.5 వేల కోట్లు పైచిలుకు ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా వచ్చారని, అసలైన ఎంవోయూలు ఎలా ఉంటాయో చూపిద్దామని తన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించారని, ఇలా సంతోషంగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించటం బాధాకరమన్నారు.

గౌత‌మ్ రెడ్డి మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి, వైసీపీ నాయకులు బెదిరించడం వల్లే గుండెపోటు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి

ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు... తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.