Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి అరెస్ట్.. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక ముందడుగు పడింది. కేసు విచారణలో ఇటీవల దూకుడు పెంచిన సీబీఐ ఈ తెల్లవారుజామున వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.
Vijayawada, April 16: మరో ఏడాదిలో ఎన్నికలు (Elections) జరుగనున్న ఏపీలో (AP) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో మరో కీలక ముందడుగు పడింది. కేసు విచారణలో ఇటీవల దూకుడు పెంచిన సీబీఐ (CBI) ఈ తెల్లవారుజామున వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. సీబీఐ బృందం ఈ ఉదయం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి నివాసానికి చేరుకుంది. అక్కడ విచారణ అనంతరం భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు.
రెండు రోజుల క్రితం ఉదయ్ కుమార్‌రెడ్డిని
అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డిని రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకా హత్య కేసుతో ఆయనకు సంబంధం ఉన్నట్టు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనమైంది. కాగా, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు.