Sikandar Raza (Photo-Twitter/ICC)

Lucknow, April 15: లక్నోతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో (LSG vs PBKS) పంజాబ్ ఆటగాడు సికిందర్ రజా (Sikandar Raza) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో టార్గెట్‌ ను రీచ్ అయ్యేందుకు చమటోడ్చాడు. సికింద‌ర్ ర‌జా(50) హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. మార్క్ వుడ్ వేసిన 16వ‌ ఓవ‌ర్‌లో సింగిల్ తీసి యాభైకి చేరువ‌య్యాడు. 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో అత‌ను 50 ర‌న్స్ చేశాడు. ఈ లీగ్‌లో అత‌డికి ఇదే తొలి అర్ధ శ‌త‌కం. అయితే మార్కస్ వేసిన బంతికి సికిందర్ రజా 57 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న‌మాథ్యూ షార్ట్(34) ఔట‌య్యాడు. కృష్ణ‌ప్ప గౌతమ్ వేసిన ఆరో ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి అత‌ను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 45 ర‌న్స్ వ‌ద్ద పంజాబ్ మూడో వికెట్ ప‌డింది.

అంతకుముందు సొంత గ్రౌండ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG vs PBKS) 159 ప‌రుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(74) (KL Rahul) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. అత‌డికి కృనాల్ పాండ్యా(18), స్టోయినిస్(15) స‌హ‌కారం అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నోకు ఓపెనర్లు రాహుల్(74) కైల్ మేయ‌ర్స్ (29) శుభారంభం ఇచ్చారు. హ‌ర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో మేయ‌ర్స్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 53 ర‌న్స్ వ‌ద్ద ఆ జ‌ట్టు మొద‌టి వికెట్ కోల్పోయింది.

ఆ త‌ర్వాత వ‌చ్చిన దీప‌క్ హుడా(0)ను సికింద‌ర్ ర‌జా ఎల్బీగా ఔట్ చేశాడు. కృనాల్ పాండ్యాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. గ‌త మ్యాచ్‌లో సిక్స‌ర్ల మోత మోగించిన‌ నికోల‌స్ పూర‌న్ డ‌కౌట‌య్యాడు. స్టోయినిస్ ఉన్నంత సేపు చెల‌రేగి ఆడాడు. 11 బంతుల్లో రెండు సిక్స్‌ల‌తో 15 ర‌న్స్ చేశాడు. దాంతో, ల‌క్నో స్కోర్ 180 దాటేలా క‌నిపించింది. కానీ, సామ్ క‌ర‌న్ మూడు వికెట్ల‌తో ల‌క్నోను దెబ్బ‌కొట్టాడు. ర‌బాడ రెండు వికెట్లు తీశారు. హ‌ర్‌ప్రీత్ బ్రార్, సికింద‌ర్ ర‌జా, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.