Hyderabad Horror: పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం.. గుంటూరు యువకుడి ఘాతుకం.. హైదరాబాద్ లో కేసు
దీంతో ఆ జూనియర్ ఆర్టిస్టు అతనికి దగ్గరైంది. తీరా ఆమెనూ గర్భవతిని చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్నాడు ఓ దుండగుడు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువకుడిపై హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Hyderabad, Feb 18: పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్టు (Junior Artist) అతనికి దగ్గరైంది. తీరా ఆమెనూ గర్భవతిని (Pregnant) చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్నాడు ఓ దుండగుడు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువకుడిపై హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ (SR Nagar) పోలీస్ స్టేషన్‌లో (Police Station) కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల యువతి 2021లో హైదరాబాద్‌కు వచ్చి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ బోరబండలో ఉంటోంది.
గుంటూరు జిల్లా కాకానికి చెందిన రోహిత్ ఖాన్ (24) ఆమె ఫోన్ నంబరు సంపాదించి పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరింది. అప్పటి నుంచి రోహిత్ ఖాన్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తాజాగా ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.