AP High Court Judge Injured: ఏపీ హైకోర్టు జడ్జి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా.. ప్రమాదంలో జస్టిస్ సుజాతకు గాయాలు.. వీడియోతో
ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
Hyderabad, Sep 11: రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏపీ హైకోర్టు (AP High court) న్యాయమూర్తి జస్టిస్ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడకు (Vijayawada) వెళ్తుండగా జాతీయ రహదారి 65పై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జీ తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు దెబ్బతినగా న్యాయమూర్తి జస్టిస్ సుజాతతోపాటు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై విష్ణుమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని వారిని సూర్యాపేటలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు.
Telangana Rain Update: తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఏపీలో కూడా..
మంత్రి కాన్వాయ్ లో
వర్షం కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్టు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను సూర్యాపేట దవాఖానలో చేర్చగా వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దాంతో మంత్రి వెంటనే తన కాన్వాయ్‌లో హైదరాబాద్ తీసుకెళ్లారు.
Roja Celebrations: చంద్రబాబు అరెస్టుతో స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న మంత్రి రోజా