Cold Wave In Telugu States: చ.. చ.. చలి.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో అంతకంతకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం.. దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడొచ్చన్న వాతావరణశాఖ

ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇవాళ, రేపు చలి మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Credits: Istock

Hyderabad, Nov 20: పెరిగిన చలి తీవ్రత (Cold Intensity) తో తెలుగు రాష్ట్రాలు (Telugu States) వణికిపోతున్నాయి. ఉత్తర భారతదేశం (North India) నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. ఇవాళ, రేపు చలి (Cold) మరింతగా ప్రభావం చూపెడుతుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని (Telangana) వికారాబాద్, కొమురంభీమ్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. కొమురంభీమ్ జిల్లాలోని సిర్పూర్(యు)లో 9.8 డిగ్రీలు, నేరడిగొండలో 10.1 డిగ్రీలు, బేలలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నిర్మల్ జిల్లా తాండ్రలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోవైపు ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్ డిజిట్ దిశగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం మరింతగా పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ కు చివరి తేదీ ఇదే.. ఆ తర్వాత చేయాలంటే భారీ జరిమానా.. మరోసారి గడువు తేదీ పొడిగించేది లేదన్న ఆదాయపు పన్ను శాఖ.. తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని సూచన

చలిగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో  వృద్ధులు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు మార్నింగ్ వాక్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న పిల్లలకు చలిగాలులు తగలకుండా చూసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.