IITH Student Case: విషాదాంతంగా మారిన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి కథ.. విశాఖ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న కార్తీక్.. ఈ ఉదయం వైజాగ్ సముద్రం ఒడ్డున మృతదేహం గుర్తింపు
నగరం నుంచి విశాఖపట్టణం చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Hyderabad, July 25: ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) (ఐఐటీహెచ్) విద్యార్థి కార్తీక్ (Karthik) అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నగరం నుంచి విశాఖపట్టణం (Vishakhapatnam) చేరుకున్న విద్యార్థి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదయం సముద్రం ఒడ్డున కార్తీక్ మృతదేహం లభ్యమైంది. కార్తీక్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా..
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ ఐఐటీహెచ్‌లో బీటెక్ (మెకానికల్) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 17న క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. అధికారుల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వైజాగ్ వెళ్లినట్టు గుర్తించారు. అతడి కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. చివరికి విద్యార్ధి కథ విషాదంగా ముగిసింది.