Father Wax Statue: లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తండ్రి.. ఆయన విగ్రహం సాక్షిగా కూతురు పెళ్లి.. కొత్తగూడెంలో అరుదైన ఘటన

అందుకే తండ్రి ఈ లోకంలో లేకపోయినా.. ఆయన ప్రతిరూపం సాక్షిగా ఆమె పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది.

Father Wax Statue (Credits: X)

Hyderabad, Dec 29: తండ్రిపై (Father) ఆ కూతురికి ఉన్న మమకారం ఆకాశం కంటే పెద్దది. అందుకే తండ్రి ఈ లోకంలో లేకపోయినా.. ఆయన ప్రతిరూపం సాక్షిగా ఆమె పెళ్లి చేసుకున్నది. ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఐటీ విభాగంలో డీజీఎంగా పని చేస్తున్న బాలరాజు 2019లో అనారోగ్యంతో మృతిచెందారు. అతడికి కుమారుడు, కూతురు ఉన్నారు. బాలరాజు ఉద్యోగాన్ని తన కూతురు స్నేహకు ఇచ్చారు. శుక్రవారం రాత్రి కొత్తగూడెంలోని కేసీవోఏ క్లబ్‌ లో స్నేహ పెళ్లి జరిగింది.

రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని కండీషన్

తండ్రి తమతోనే ఉండాలని..

అయితే, పెండ్లి కూతురు స్నేహ తన తండ్రి తమతో ఉండాలనే ఉద్దేశంతో రూ.4 లక్షలతో ఆయన మైనపు విగ్రహాన్ని (Father Wax Statue) తయారు చేయించి వీల్‌ చైర్‌ లో కూర్చోబెట్టి వివాహ వేడుక జరిగేంత వరకు మంటపంలో ఉంచింది. ఈ విగ్రహాన్ని తన తమ్ముడు దగ్గరుండి చేయించినట్టు సమాచారం. తండ్రి కళ్లముందే పెళ్లి జరుగుతున్నదని స్నేహ మురిసిపోయింది. అచ్చం మనిషిలా ఉండే ప్రతిమను తయారు చేయించి తీసుకురావడంతో అందరూ ఫొటోలు దిగారు.