NIA Rides in Telugu States: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు
హైదరాబాద్ తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Hyderabad, Oct 2: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (Telangana) ఎన్‌ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల సంఘం నేత ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయన పౌరహక్కుల సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న అన్నపూర్ణ, అనూశ నివాసాల్లోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్ లోనూ
హైదరాబాద్‌లోని విద్యానగర్ కు చెందని ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత సురేశ్ ఇంటిపై ఎన్‌ఐఏ దాడి చేసింది. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, రిక్రూట్ మెంట్ కు సహాయసహకారాలు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Earthquake in Haryana: హర్యానాలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రత