Vande Bharat Express: కేవలం 8.30 గంటల్లోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి.. వందేభారత్‌ లో రయ్.. రయ్.. టైమింగ్స్‌ ప్రకటించిన రైల్వే శాఖ

తిరుపతి పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు హైదరబాద్ వాసుల కోసం వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది.

Vande bharat (Photo Credits: Twitter)

Tirupati, March 31: తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తిరుపతి (Tirupati) పుణ్యక్షేత్రానికి అత్యంత వేగంగా చేరుకునేందుకు హైదరబాద్ (Hyderabad) వాసుల కోసం వందేభారత్‌ రైలు (Vande Bharat Express) అందుబాటులోకి వస్తోంది. ఏప్రిల్‌ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ పరుగులు పెట్టనుంది. ఈ రైలు మంగళవారం మినహా ప్రతి రోజూ తిరుగుతుంది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం 8.30 గంటలు. ఛార్జీల వివరాలను రైల్వే శాఖ ప్రకటించాల్సి ఉంది. ఏప్రిల్‌ 8న సికింద్రాబాద్‌లో రైలును ప్రారంభిస్తున్నప్పటికీ ఆ రోజు ప్రయాణికులను అనుమతించబోరు. ఆ రోజు సికింద్రాబాద్‌లో 11.30 గంటలకు ప్రారంభమై తిరుపతి 21.00 గంటలకు చేరుతుంది. ఈ  మేరకు రైల్వే శాఖ టైమింగ్స్ ప్రకటించింది.

West Bengal: వీడియో ఇదిగో, హౌరాలో రామ నవమి ఊరేగింపులో రచ్చ, వాహనాలను తగులబెట్టిన ఆందోళనకారులు, చెదరగొట్టిన పోలీసులు

వందేభారత్‌ టైమింగ్స్ ఇవి

సికింద్రాబాద్‌-తిరుపతి (20701): సికింద్రాబాద్‌ ఉదయం 6.00, నల్గొండ 07.19, గుంటూరు 09.45, ఒంగోలు 11.09, నెల్లూరు 12.29, తిరుపతి 14.30.

తిరుపతి-సికింద్రాబాద్‌(20702): తిరుపతి మధ్యాహ్నం 15.15, నెల్లూరు 17.20, ఒంగోలు 18.30, గుంటూరు 19.45, నల్గొండ 22.10, సికింద్రాబాద్‌ 23.45.

New Parliament Building Pics: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఫోటోలు చూశారా, ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మిక తనిఖీ, సోషల్ మీడియాలో పిక్చర్స్ వైరల్