Accident: ఆదిలాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు.. సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొన్న వాహనం.. మృతులను ఆదిలాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.

Accident (Credits: Google)

Adilabad, October 31: ఆదిలాబాద్ జిల్లా (Adilabad) గుడిహత్నూర్ మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆదిలాబాద్ (Adilabad) వెళ్తున్న కారు సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.

మృత్యు వంతెన...గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ప్రమాదంలో 77కు చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయ చర్యలు, మృతులకు రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన..

ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళను రిమ్స్‌కు తరలించారు. మృతులను ఆదిలాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.