Awards for Telangana Cops: సత్తా చాటిన తెలంగాణ పోలీసులు, జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు 27 మంది ఎంపిక, దేశవ్యాప్తంగా మొత్తం 1,380 మంది పోలీస్‌ సిబ్బందికి పతకాలను అందజేసిన హోం శాఖ

వీరితోపాటు జైళ్లశాఖలో ముగ్గురికి, అగ్నిమాపకశాఖలో ఇద్దరికి పతకాలు (national level police medals ) లభించాయి. పోలీస్‌శాఖ (TS Police) నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మందికి పోలీస్‌ శౌర్యపతకాలు, 11 మందికి విశిష్ట పోలీస్‌ సేవా పతకాలు దక్కాయి.

TS police Logo

Hyderabad, August 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ స్థాయి పోలీస్‌ పతకాలకు తెలంగాణ నుంచి 27 మంది (Awards for Telangana Cops) ఎంపికయ్యారు. వీరితోపాటు జైళ్లశాఖలో ముగ్గురికి, అగ్నిమాపకశాఖలో ఇద్దరికి పతకాలు (national level police medals ) లభించాయి. పోలీస్‌శాఖ (TS Police) నుంచి ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మందికి పోలీస్‌ శౌర్యపతకాలు, 11 మందికి విశిష్ట పోలీస్‌ సేవా పతకాలు దక్కాయి. ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకానికి రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఇంచార్జి, అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, జనగామ వెస్ట్‌జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ బండ శ్రీనివాస్‌రెడ్డి ఎంపికయ్యారు.

దేశవ్యాప్తంగా మొత్తం 1,380 మంది పోలీస్‌ సిబ్బందికి కేంద్ర హోంశాఖ వివిధ క్యాటగిరీల కింద సేవా పతకాలను శనివారం ప్రకటించింది. అగ్నిమాపకశాఖలో మహబూబ్‌నగర్‌ డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సుధాకర్‌ రేణుకుంట, ఇల్లెందు ఫైర్‌ స్టేషన్‌ లీడింగ్‌ ఫైర్‌మెన్‌ చల్లాగురుగుల కొమురయ్యకు ఫైర్‌సర్వీస్‌ మెడల్‌ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పురస్కారాలు లభించాయి. కరక్షనల్‌ సర్వీస్‌ మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌కు జైళ్లశాఖ డీఎస్పీ మహేంద్ర కృష్ణమూర్తి, చీఫ్‌ హెడ్‌వార్డర్‌ బీ నారాయణ, హెడ్‌వార్డర్‌ వేముల జంగయ్య ఎంపికయ్యారు. పతకాలకు ఎంపికైన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అభినందించారు.

సత్తా చాటిన ఏపీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 27 పతకాలను దక్కించుకున్న గౌతం సవాంగ్ టీం, అవార్డు అందుకున్న వారి పూర్తి వివరాలు ఇవే..

పోలీస్‌ శౌర్యపతకాలకు ఎంపికైనవారు

బీ మరియదాస్‌ -ఆర్‌ఐ, గ్రేహౌండ్స్‌

పీకేఎస్‌ రమేశ్‌ -ఆర్‌ఎస్సై, గ్రేహౌండ్స్‌

గుర్రం కృష్ణప్రసాద్‌ -ఎస్సై, జయశంకర్‌ భూపాలపల్లి

కే పరశురామ్‌నాయక్‌ -హెడ్‌కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

ఎన్‌ లాల్యా -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

ఎం పాపారావు -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

ఎం భాస్కర్‌రావు -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

జీ ప్రతాప్‌సింగ్‌ -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

కే వెంకన్న -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

మాలోతు రాములు -కానిస్టేబుల్‌ గ్రేహౌండ్స్‌

అబ్దుల్‌ అజీమ్‌ -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

కే తిరుపతయ్య -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

పీ సత్యనారాయణ -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

వీ రమేశ్‌ -కానిస్టేబుల్‌, గ్రేహౌండ్స్‌

విశిష్ట పోలీస్‌ సేవా పతకాలకు ఎంపికైనవారు

వీ శివకుమార్‌ -డీఐజీ, ఇంటిలిజెన్స్‌, హైదరాబాద్‌

మేఘావత్‌ వెంకటేశ్వర్లు -డీసీపీ(ఏఎస్పీ), మాదాపూర్‌

రమేశ్‌ దండుగుడు -ఏఎస్పీ, స్పెషల్‌ ఐబీ, హైదరాబాద్‌

జితేందర్‌రెడ్డి -ఏసీపీ, హన్మకొండ

చంద్రశేఖర్‌ ఆకుల -ఏసీపీ, ట్రాఫిక్‌ మాదాపూర్‌ డివిజన్‌

పిచ్చయ్య మువ్వ -డీఎస్పీ, పీటీసీ, అంబర్‌పేట

సంపత్‌కుమార్‌రెడ్డి -అసిస్టెంట్‌ కమాండెంట్‌, ఫస్ట్‌ బెటాలియన్‌, టీఎస్‌ఎస్పీ, యూసుఫ్‌గూడ

ఆనంద్‌కుమార్‌ -ఏఎస్సై, ఎస్‌ఐబీ, హైదరాబాద్‌

చంద్రశేఖరరావు -ఏఎస్సై(ఐటీ, కమ్యూనికేషన్స్‌), ఆర్బీవీఆర్‌ఆర్‌ పోలీస్‌ అకాడమీ

ఆరిఫ్‌ అలీ మహ్మద్‌ -సీనియర్‌ కమాండెంట్‌, గ్రేహౌండ్స్‌ ఆపరేషన్స్‌

అనిల్‌గౌడ్‌ -హెడ్‌కానిస్టేబుల్‌, కాచిగూడ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif