27 Gallantry Awards for AP Cops: సత్తా చాటిన ఏపీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 27 పతకాలను దక్కించుకున్న గౌతం సవాంగ్ టీం, అవార్డు అందుకున్న వారి పూర్తి వివరాలు ఇవే..
AP Police Logo (Photo-File Image)

Amaravati, August 15: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు (27 Gallantry Awards for AP Cops) సత్తా చాటారు. 11 మంది పోలీస్‌ శౌర్య పతకాలు, ఇద్దరు రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 14 మంది ప్రతిభా పోలీసు పతకాలు దక్కించుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని (75th Independence Day) పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా ఇద్దరికి రాష్ట్రపతి పోలీస్‌ శౌర్య పతకాలు, 628 మందికి పోలీస్‌ శౌర్య పతకాలు, 88 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు, 662 మందికి ప్రతిభా పోలీస్‌ పతకాలు ప్రకటించింది. ఇందులో ఏపీకి మొత్తం 27 పతకాలు వచ్చాయి.

ఏపీ నుంచి నలగట్ల సుధాకర్‌రెడ్డి (డీఎస్పీ, చిత్తూరు), పి.సీతారామ్‌ (కమాండెంట్, అదనపు డీజీపీ కార్యాలయం, గ్రేహౌండ్స్‌) రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్‌ పతకాలు దక్కించుకున్నారు. అలాగే కె.రఘువీర్‌రెడ్డి (ఏఎస్పీ, ఇంటెలిజెన్స్, రాజమహేంద్రవరం), కె.సదాశివ వెంకట సుబ్బారెడ్డి (ఏఎస్పీ, ఒంగోలు), కె.నవీన్‌కుమార్‌ (ఏఎస్పీ, అదనపు డైరెక్టర్‌ కార్యాలయం, హైదరాబాద్‌), వట్టికుంట వెంకటేశ్వర నాయుడు (ఏసీపీ, దిశ పోలీస్‌స్టేషన్, విజయవాడ), చింతపల్లి రవికాంత్‌ (ఏసీపీ, సిటీ స్పెషల్‌ బ్రాంచ్, విజయవాడ), వెంకటప్ప హనుమంతు (అసిస్టెంట్‌ కమాండెంట్, 6వ బెటాలియన్, ఏపీఎస్పీ, మంగళగిరి), జి.రవికుమార్‌ (డీఎస్పీ, తిరుపతి), కడిమిచెర్ల వెంకట రాజారావు (డీఎస్పీ, పీటీవో, మంగళగిరి), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్డీపీవో, నెల్లూరు), బోళ్ల గుణ రాము (ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజయవాడ), మద్ది కోటేశ్వరరావు (ఎస్‌ఐ, సీసీఎస్, శ్రీకాకుళం), మేడిద వెంకటేశ్వర్లు (ఏఆర్‌ఎస్‌ఐ, నెల్లూరు), రమావత్‌ రామనాథం (ఏఆర్‌ఎస్‌ఐ, సీఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఈర్వ శివశంకర్‌రెడ్డి (ఏఆర్‌ఎస్‌ఐ, 9వ బెటాలియన్, వెంకటగిరి).

రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలి, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం ఇదే, ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

కేంద్ర హోం శాఖ పరిధిలోని అధికారులకు ప్రతిభా పోలీస్‌ పతకం: రాజ్‌కుమార్‌ మద్దాలి (అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌–2, విజయవాడ) ప్రతిభా పోలీస్‌ పతకాలు అందుకున్నారు.

ఏపీ నుంచి పోలీస్‌ శౌర్య పతకాలు దక్కించుకున్నవారు: ఎస్‌.బుచ్చిరాజు (జేసీ), జి.హరిబాబు (జేసీ), ఆర్‌.రాజశేఖర్‌ (డీఏసీ), డి.మబాష (ఏఏసీ), బి.చక్రధర్‌ (జేసీ), కె.పాపినాయుడు (ఎస్‌ఐ), సీహెచ్‌ సాయిగణేష్‌ (డీఏసీ), ఎం.ముణేశ్వరరావు(ఎస్సీ), ఎం.నాని (జేసీ), పి.అనిల్‌కుమార్‌ (జేసీ), టి.కేశవరావు (హెచ్‌సీ)