Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావించారు.

AIMIM MLA Akbaruddin Owaisi (Photo-Video Grab0

Hyderabad, DEC 21: పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావించారు. పుష్ప-2 మూవీ (Pushpa 2) విడుదల సందర్భంగా జరిగిన తొక్కీసలాటలో ఓ మహిళ మృతి చెందినా హీరో సినిమాను చూసి వెళ్లారని విమర్శించారు.

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్  

దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ (Allu Arjun) బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

Akbaruddin Owaisi's big claim on Allu Arjun

 

ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) కామెంట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం స్పందించారు. సంథ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ ఘటనను తప్పు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని.. అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని సీఎం ప్రశ్నించారు. సంథ్య థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు సంథ్య థియేటర్ యాజమాన్యం బందోబస్తు కావాలంటూ దరఖాస్తు చేసిందని సీఎం వివరించారు. హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని అందులో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే, థియేటర్ యాజమాన్యం చేసిన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని సీఎం గుర్తు చేశారు. సంధ్య థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా.. సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారన్నారు. దరఖాస్తు తిరస్కరించినా సెలబ్రీటీలు థియేటర్‌కు వచ్చారన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ రోడ్‌ షో చేస్తూ థియేటర్‌కు వచ్చారని.. అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ తెలిపారు.



సంబంధిత వార్తలు

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif