CM KCR's Letter To PM Modi: జాతీయస్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషలో నిర్వహించాలి, ప్రధానికి లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారంటూ లేఖలో ఆవేదన

ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ (CM KCR's Letter To PM Modi) రాశారు

Telangana CM KCR | File Photo

Hyderabad, Nov 21: జాతీయస్థాయిలో జరిగే నియామక పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని (Allow Regional Languages In Competitive Exams) తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ (CM KCR's Letter To PM Modi) రాశారు. కేంద్ర ప్రభుత్వ నియామకాలు, ప్రభుత్వరంగ సంస్థలు, భారతీయ రైల్వేలు, రక్షణరంగ సంస్థలు, జాతీయ బ్యాంకులన్నీ నియామక పరీక్షలను హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లోనే నిర్వహిస్తున్నాయని, ఇది తెలుగు విద్యార్థులకు శాపంగా మారిందని లేఖలో తెలిపారు.

దీనివల్ల ఇంగ్లిష్‌ మీడియం చదవని విద్యార్థులకు, హిందీ భాష మాట్లాడని రాష్ట్రాల్లో ఉన్నవారికి తీవ్ర ప్రతికూలతలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం గుర్తించిన ప్రకారం దేశవ్యాప్తంగా 22 భాషలున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణరంగ సంస్థలతోపాటు జాతీయ సంస్థలన్నీ కేవలం రెండు భాషల్లోనే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీనిపై కొంచెం పునరాలోచించాలని తెలంగాణ సీఎం కోరారు.

శభాష్ ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా పెద్ద విధ్వంసాన్ని ఆపారు, కశ్మీర్లో పరిస్థితిపై ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

ఉద్యోగాల భర్తీలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు రావడం లేదు. కేవలం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు, ఇంగ్లిష్‌ వచ్చినవాళ్లకు మాత్రమే ఉద్యోగాల భర్తీలో అవకాశం కలుగుతున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేలా అన్నిరకాల పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని సీఎం కోరారు. ముఖ్యంగా యూపీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక ఏజెన్సీలు, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు, జాతీయ బ్యాంకులు, ఆర్బీఐ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్లు మొదలైన వాటిలో నియామకాలకు నిర్వహించే పోటీ పరీక్షలను అభ్యర్థులు ప్రాంతీయ భాషల్లో కూడా రాసేందుకు అనుమతించాలని సీఎం కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణరంగ సంస్థలతోపాటు జాతీయ సంస్థలన్నీ కేవలం రెండు భాషల్లోనే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇది ఇతర భాషల విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు మాట్లాడే విద్యార్థులంతా తీవ్రంగా నష్టపోవడానికి కారణం అవుతున్నది. కేవలం హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు, ఇంగ్లిష్‌ వచ్చినవాళ్లకు మాత్రమే ఉద్యోగాల భర్తీలో అవకాశం కలుగుతున్నది.