New Delhi, November 21: భారత ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లో పరిస్థితిపై శుక్రవారంనాడు ఉన్నతస్థాయి భద్రతాసమీక్ష (PM Modi Holds Security Review) నిర్వహించారు. ఈ సమీక్షలో హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ (National Security Advisor (NSA) Ajit Doval), విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శింగ్లా (Foreign Secretary Harsh Vardhan Shringla), హోం, ఆర్మీ, ఇంటెలిజెన్స్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్షలో భారత ఆర్మీపై పొగడ్తల వర్షం కురిపించారు. కొద్ది రోజుల కిందట జమ్మూ కశ్మీర్లోకి చొరబడ్డ జైషే మొహమ్మద్‌కు ( Jaish-e-Mohammed,terrorist organisation) చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా ఓ పెద్ద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భద్రతా బలగాల (Security forces) అప్రమత్తత వల్ల పెద్ద ఉపద్రవం తప్పిందన్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను హతమార్చడంలో భద్రతా బలగాలు గొప్ప శౌర్యసాహసాలను ప్రదర్శించాయి. వారి వద్ద భారీ ఎత్తున లభించిన ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు వారు భారీ ఉగ్రదాడికి పన్నాగం పన్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భద్రతా బలగాల అప్రమత్తతతో పెద్ద విధ్వంసం తప్పింది’ అని ఆ సమావేశం తరువాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Here's PM Tweet
Neutralising of 4 terrorists belonging to Pakistan-based terrorist organisation Jaish-e-Mohammed and the presence of large cache of weapons and explosives with them indicates that their efforts to wreak major havoc and destruction have once again been thwarted.
— Narendra Modi (@narendramodi) November 20, 2020
ముంబై దాడులు జరిగిన నవంబర్ 26న, అదే తరహాలో భారీ ఉగ్ర దాడి చేయాలని టెర్రరిస్టులు కుట్రపన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కుట్రలో భాగంగా ఇండియాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై భారత సైనం కాల్పులకు దిగింది. జమ్మూకశ్మీర్ హైవేపై నగ్రోటా వద్ద గురువారం జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రక్‌లో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించాయి. భారత్‌లో భారీ ఉగ్రదాడి లక్ష్యంతో వారు ఈ మధ్యనే పాక్ సరిహద్దులు దాటి భారత్‌లోకి వచ్చినట్లు భద్రతావర్గాలు భావిస్తున్నాయి.
ముంబై దాడుల వార్షిక దినం 26/11 సందర్భంగా మరోసారి దాడులకు ప్లాన్ చేసిన జైష్ టెర్రరిస్టులను కడతేర్చడం, వారి వద్ద నుంచి అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనపరుచుకోవడం... మొదలైన వాటితో ఓ పెను విధ్వంసం నివారించినట్లయింది.మన దళాల అప్రమత్తత వల్ల త్వరలో జరిగే ప్రజాస్వామిక ప్రక్రియ (స్థానిక ఎన్నికలు)ను దెబ్బతీయాలన్న పన్నాగమూ నిర్వీర్యమయింది’’ అని సమావేశానంతరం చేసిన ట్వీట్లలో ప్రధాని పేర్కొన్నారు.
దాడికి వ్యూహాం ఎలా జరిగింది
జమ్మూ శ్రీనగర్ హైవే మీద నగ్రోటా వద్ద టోల్ ప్లాజా సమీపంలో గురువారం తెల్లవారుఝామున ఓ ట్రక్కులో ప్రయాణిస్తున్న ఉగ్రవాదులను గస్తీ దళాలు నిలువరించినపుడు వారు కాల్పులకు దిగారు. దాదాపు 2గంటలపాటు సాగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు చనిపోగా ఇద్దరు పోలీసులకు బులెట్ గాయాలయ్యాయి. చావుకి తేదీ అనేది ఉండదు అని ఆ ట్రక్కుపై రాసి ఉండడం విశేషం. పాక్‌లోని పంజాబ్‌లో నరోవాల్ జిల్లా కిందకు వచ్చే షకర్‌గఢ్ ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న పాక్ రేంజర్లు ఈ నలుగురు ఉగ్రవాదులు దేశంలో చొరబడడానికి వెసులుబాటు కల్పించినట్లు తేలింది. కశ్మీర్ అంతటా అప్రమత్తత ప్రకటించారు. వైష్ణోదేవీ ఆలయానికి భద్రత కట్టుదిట్టం చేశారు. ఈనెల 25 నుంచి డిసెంబరు 19 దాకా 8దశల్లో- జమ్మూ కశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలు జరగనున్నాయి.
కరోనా టీకా వ్యూహంపై మోదీ సమీక్ష
కరోనా టీకా అభివృద్ధి పురోగతి, నియంత్రణ సంస్థల అనుమతులు, ప్రజలకు చేరవేయడం ఎలాగన్నదానిపై శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ సభ్యులు సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.