Amrabad tiger reserve: అటవీ ప్రేమికులకు బంపర్ ఆఫర్, నల్లమలలో టైగర్ సఫారీ, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, రూ. 4,600కే కపుల్స్‌కు ఎంట్రీ

సఫారీ అంటే ఆఫ్రికాలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇప్పటివరకు మనకు ఉన్న అపోహను తొలగిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో టైగర్ సఫారీని అందుబాటులోకి తెచ్చింది.

Tiger at Bronx Zoo in US Tests Positive for Coronavirus (Photo- Wikimedia Commons)

Hyderabad November 17:  ఫారెస్ట్ లవర్స్‌కు అటవీశాఖ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. సఫారీ అంటే ఆఫ్రికాలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇప్పటివరకు మనకు ఉన్న అపోహను తొలగిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో టైగర్ సఫారీని అందుబాటులోకి తెచ్చింది. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, నక్కలు, చుక్కల జింకలు, సాంబార్‌ జింకలు, నీల్గాయి, చింకారా, బ్లాక్‌బక్‌, మూషిక జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు.. తదితర 19 రకాల జంతువులు, 300 రకాల అరుదైన పక్షులు.. ఇవన్నీ మన తెలంగాణలోనే చూసే అవకాశం వచ్చింది.

హైదరాబాద్‌కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి రమణీయ నల్లమల అడవిలో ఉన్న అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో వీటన్నింటినీ వీక్షించే అవకాశాన్ని కల్పించింది అటవీశాఖ.

టైగర్‌ సఫారీలో భాగంగా ఫరహాబాద్‌ గేటు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో సఫారీ ఏర్పాటు చేశారు. ఇద్దరు పర్యాటకులు రూ.4,600తో ఒకరోజు ఉండేందుకు కాటేజీతో పాటు టైగర్‌ సఫారీ, మరుసటి రోజు మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ ఈ టూర్‌లో భాగం. ఆహ్లాదాన్ని పంచే అడవిలో పక్షులు, జంతువుల మధ్య ఆనందంగా గడపవచ్చు. అడవి మధ్యలో నివసించే చెంచుల జీవన విధానం తెలుసుకోవచ్చు.

పర్యావరణ పరిరక్షణ, పులులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని, జంతుజాలం, పక్షుల గురించి తెలుసుకునేలా ఈ ట్రిప్‌ను రూపొందించారు. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌, సీసీఎఫ్‌బీ శ్రీనివాస్‌ తెలిపారు. టూర్‌ కోసం amrabadtigerreserve.comలో బుక్‌ చేసుకోవచ్చు.

దాదాపు 2,611 కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ నాగర్‌కర్నూల్‌, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉన్నది. కోర్‌ ఏరియాను పరిగణలోకి తీసుకొంటే ఇది దేశంలోనే రెండో అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌. 1983లో దీనిని శాంక్చురీగా ప్రకటించగా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏటీఆర్‌గా మార్చారు. టైగర్‌ సఫారీలో టూరిస్టుల కోసం అన్ని వసతులతో డజను కాటేజీలను మన్ననూరులో ఏర్పాటుచేశారు.



సంబంధిత వార్తలు

Manmohan Singh Funeral Ceremony: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణతో మన్మోహన్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్న కేసీఆర్, ప్రతి సందర్భంలో మనోధైర్యం నింపారని వెల్లడి

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి