Anand Mahindra: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు.

Anand Mahindra to be chairman of Young India Skills University Telangana Says CM Revanth Reddy

Hyd, August 5: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు. ఇది పీపీపీ మోడల్‌లో ఉంటుందన్నారు. ఈ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని తాను ఆనంద్ మహేంద్రకు విజ్ఞప్తి చేశానన్నారు.

ఆయన రెండు రోజుల్లో స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 1న ముచ్చర్లలో స్కిల్స్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల సమీకరణ కోసమే ఈ రోజు న్యూయార్క్ పర్యటనకు వచ్చానన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి ఐటీ సంస్థలు వచ్చాయన్నారు. అధికారంలో టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, మరో పార్టీ ఉన్నా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించి ముందుకు సాగుతున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్, హైటెక్ సిటీ నిర్మించామన్నారు. 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందంటే... ఈరోజు 250 కిలో మీటర్లతో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.  ప్రపంచంతోనే పోటీ పడుతున్న తెలంగాణ, న్యూ జెర్సీలో భారీ కార్ల ర్యాలీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్

హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు మణిహారం అయితే, రీజినల్ రింగ్ రోడ్డు వడ్డాణం అవుతుందని వ్యాఖ్యానించారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ రీజియన్‌గా మూడు లేయర్ల కింద అభివృద్ధి చేసేలా, మెగా మాస్టర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచంలో చాలామంది వైద్యం కోసం మన దేశానికి, మన రాష్ట్రానికి వస్తున్నారన్నారు.

Here's T Congress Tweet

తెలంగాణలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఎన్నారైలు సహకరించాలని ఆయన కోరారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీయిచ్చారు. హైదరాబాద్ లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని.. ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.  సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్ 

బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ విమర్శించారు. ఎన్నారైల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చిందని తెలిపారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగాయని.. బీఆర్ఎస్ చర్చల్లో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందన్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా అంతకుముందు న్యూజెర్సీలో కాంగ్రెస్ అభిమానులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు.