AP Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీ కొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో 10 మందికి గాయాలు

ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి దగ్గర ఆటోను కారు (AP Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా (Four persons killed on the spot) గుర్తించారు.

Accident Representative image (Image: File Pic)

Prakasam, Mar 24: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి దగ్గర ఆటోను కారు (AP Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా (Four persons killed on the spot) గుర్తించారు. ఎర్రగొండపాలెంకు చెందిన కూలీలు మిర్చి కోతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో... కొత్తపల్లి వద్ద ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీ (car collides auto in Prakasam ) కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వెళ్తున్న కూలీల్లో ఇద్దరు, కారులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందారు. ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు.

ఇక కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం బన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది . మృతులు ప్రకాశం జిల్లా వెల్లటూరు గ్రామానికి చెందిన నాంచారయ్య(25), మల్లికార్జున(23) గా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్థానిక పోస్టుమార్టం గదికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif