Rajiv Swagruha Flats: హైదరాబాద్‌లో రూ. 15లక్షలకే ఫ్లాట్ అందిస్తున్న సర్కారు, తక్కువధరలో అపార్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇప్పుడు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు సంబంధించిన టవర్లను కూడా అమ్మేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని పోచారం (Pocharam), గాజులరామారంలోని (Gajula ramaram) మొత్తం పనులు పూర్తి కాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
Hyderabad, DEC 24: ఇప్పటికే రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విడిగా అమ్మకానికి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు సంబంధించిన టవర్లను కూడా అమ్మేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని పోచారం (Pocharam), గాజులరామారంలోని (Gajula ramaram) మొత్తం పనులు పూర్తి కాని రాజీవ్ స్వగృహ టవర్ల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. పోచారంలో 4, గాజులరామారంలో 5 టవర్ల విక్రయించనున్నట్లు పేర్కొంది. పోచారంలోని ఒక్కో టవర్లో 72 నుంచి 198 ఫ్లాట్లు ఉండగా... గాజుల రామరంలోని ఒక్కో టవర్లో 112 ఫ్లాట్లు ఉన్నాయి. ఆసక్తి కలిగిన సంస్థలు, వ్యక్తులు టవర్ మొత్తం వ్యయంలో రెండు శాతం ఈఎండీ సమర్పించాలని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తెలిపింది.
ఈఎండీ సమర్పించేందుకు జనవరి 30 వ తేదీ వరకు గడువు విధించింది. లాటరీ ద్వారా ఈ టవర్లను కేటాయించనున్నట్టు పేర్కొంది. https://www.hmda.gov.in/ , https://www.swagruha.telangana.gov.in/ వెబ్ సైట్లలో టవర్ల వివరాలు, పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే నాగోల్ లోని బండ్లగూడ, పోచారంల్లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు సంబంధించి కూడా విడిగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆసక్తి కలిగిన వారు జనవరిలో టోకెన్ అమౌంట్ చెల్లించాలని సూచించింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది.