Vijayawada, FEB 01: ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గా ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) నియాకమయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సేవలు అందించారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో వైఎస్సార్‌సీపీ (YSRCP Govt) ప్రభుత్వం రెండుసార్లు ఆయనను సస్పెండ్ చేసింది. ఆయన కోర్టులను ఆశ్రయించగా.. చివరకు గత ప్రభుత్వం మే 31న ఉదయమే పోస్టింగ్ ఇవ్వగా.. అదే రోజు సాయంత్రం ఆయన ఉద్యోగ విరమణ చేయడం విశేషం. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆయనకు ఊరట కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నది.
సస్పెన్షన్ కాలానికి జీతం ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు సస్పెన్షన్ కాలాన్ని ఆంధ్రప్రదేశ్ క్రమబద్ధీకరించింది. నమోదైన అభియోగాలు సైతం వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు చెల్లించాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.
తాజాగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు (AP Police Housing Corporation Chairman) చైర్మన్‌గా నియమించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో తొలి దఫాలో 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు, రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ కాలానికి సంబంధించిన వేతనాలు, అలవెన్స్‌లు మొత్తం చెల్లించాలని.. సస్పెన్షన్ వేటు వేయకపోయి ఉండి ఉంటే ఎంత మొత్తం వచ్చేదో అంత మేరకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.