
Hyd, Feb 1: సివిల్ విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నారు మొగుళ్ళపల్లి ఎస్ఐ(SI Boragala Ashok). ఒక వ్యక్తికి మద్దతుగా భూమి వదలాలని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లం* కొడకా అంటూ బూతులు తిడుతూ, వేధింపులకు పాల్పడ్డాడు ఎస్ఐ బొరగాల అశోక్.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో పిన్నింటి రాజేశ్వర్ రావు అనే వ్యక్తి పొలానికి దారి కోసం బల్గూరి సంపత్ రావును భూమి వదలాలని వేధింపులకు గురిచేస్తున్నాడు మొగుళ్ళపల్లి ఎస్ఐ బొరగాల అశోక్.
తాతల నాటి నుంచి వస్తున్న సొంత భూమిని ఇవ్వలేమన్న బల్గూరి సంపత్ రావును నవంబర్ 7వ తేదీన బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి భూమి ఇవ్వాలని బెదిరించి, బూతులు తిట్టాడు ఎస్ఐ బొరగాల అశోక్.
సివిల్ విషయంలో దూరి తమను బెదిరిస్తున్నాడని, తమకు ప్రాణభయం ఉందని ఎస్ఐ అశోక్‌పై డీజీపీకి, జయశంకర్ భూపాలపల్లి కమిషనర్ కిరణ్ కరేకు ఫిర్యాదు చేసిన సంపత్ రావు కుమారుడు శశిధర్ రావు.. ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని సీఐను ఆదేశించిన కమిషనర్ కిరణ్ కరే. వీడియో ఇదిగో, దారిలో వేధించిన పోకిరిని పట్టుకుని చితకబాదిన యువతి, భార్యకు చేయి అందించిన వికలాంగుడైన భర్త
దీంతో పిన్నింటి రాజేశ్వర్ రావు అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి, ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా సంపత్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టాడు ఎస్ఐ అశోక్.
మళ్లీ నిన్న బల్గూరి సంపత్ రావును పోలీస్ స్టేషన్‌కు పిలిచి నీ మీద కేసు నమోదైంది.. నీ కొడుకు రూల్స్ మాట్లాడుతున్నాడు, ఏం అనుకుంటున్నాడు. దారికి భూమి ఇస్తావా, నీ సంగతి చూడాలా లం* కొడకా అంటూ బూతులు తిట్టి, పోలీస్ స్టేషన్ లో 4 గంటలు కూర్చోబెట్టాడు ఎస్ఐ అశోక్. ఎస్ఐ తమను తీవ్రంగా వేధిస్తున్నాడని, తమకు ప్రాణభయం ఉందంటూ సంపత్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.