Group 4 Examination: బలగం సినిమాకు మరో అరుదైన గౌరవం, గ్రూప్‌ 4 పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న, ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా?

అంతగా అడిగిన ప్రశ్న ఏంటని అనుకుంటున్నారా? తెలంగాణ నేపథ్యంలో ఓ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం (Balagam) మూవీ గురించి గ్రూప్‌-4లో ఒక ప్రశ్న అడిగారు.

Group 4 Examination

Hyderabad, July 01: గ్రూప్‌-4 పరీక్ష (Group 4) ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8,180 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, గ్రూప్-4 పరీక్షలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, ఆర్థిక స్థితిగతులపై పలు ప్రశ్నలొచ్చాయి. అయితే ఇందులో అడిగిన ఒక ప్రశ్న సోషల్‌ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. అంతగా అడిగిన ప్రశ్న ఏంటని అనుకుంటున్నారా? తెలంగాణ నేపథ్యంలో ఓ చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బలగం (Balagam) మూవీ గురించి గ్రూప్‌-4లో ఒక ప్రశ్న అడిగారు. బలగం చిత్రానికి సంబంధించి కింద జతలలో ఏవి సరిగ్గా జతపరచడబడినవి అంటూ ప్రశ్న అడిగారు.

బలగం సినిమాతో జబర్దస్త్‌ కమెడియన్‌ యెల్దండి వేణు దర్శకుడిగా మారాడు. దిల్‌ రాజు, హన్షితా రెడ్డి, హర్షిత్‌రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. బలగం సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. కాగా, బలగం సినిమాపై గ్రూప్‌-4లో ప్రవ్న అడగడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. డైరెక్టర్‌ యెల్దండి వేణు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశాడు.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్