COVID in TS: లక్షణాలు లేని వారితోనే డేంజర్! తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా మరో 1302 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,72,608 చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య

తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 31,095 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా

Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyderabad, September 21: కరోనావైరస్ లక్షణాలు కలిగిన వారికంటే ఎలాంటి లక్షణాలు లేనివారిలోనే వైరస్ లోడు అధికంగా ఉంటుందని 'హైదరాబాద్ సెంటర్ ఫర్ డీఎన్ఎ ఫింగర్ ప్రింట్' చేసిన సర్వేలో వెల్లడైంది. లక్షణాలు లేనివారిలో ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధక శక్తి) ఎక్కువగా ఉండటం వలన లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్లుగా బయటకు కనిపిస్తున్నారు. కానీ వీరి ద్వారానే కరోనావైరస్ ఇతరులకు సులభంగా వ్యాప్తి చేయబడుతోంది, ఈ క్రమంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మృత్యువాత పడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ అని నిర్ధారణ అయిన 57 వేల మందిలో సుమారు 75 శాతం మంది లక్షణాలు లేనివారేనని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే, తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 31,095 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1,302  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా  1,205మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 25,19,315 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,72,608కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 266 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి, మేడ్చల్ పరిధుల్లో కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి.   రంగారెడ్డి నుంచి 98,  మేడ్చల్ నుంచి 24 కేసులు నిర్ధారణయ్యాయి.

 మరోవైపు నిన్న కరీంనగర్ జిల్లా నుంచి అత్యధికంగా 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే  సిద్ధిపేట నుంచి 92 మరియు నల్గొండ నుంచి 70 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

 నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1042 కు పెరిగింది.

అలాగే,  ఆదివారం సాయంత్రం వరకు మరో 2,230 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,41,930 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,636 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.