IPL Auction 2025 Live

TRS MLAs Poaching Row: ఎమ్మెల్యేల కొనుగోలుతో మా పార్టీకి, నాకు గానీ ఎలాంటి సంబంధం లేదు, యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయంలో ప్రమాణం చేసిన బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు (MLAs Buy Row) ఎపిసోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

bandi-sanjay (Photo-Video Grab)

Hyd, oct 28: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు (MLAs Buy Row) ఎపిసోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద స్నానం చేశారు. తడిబట్టలతో దేవాలయంలోకి వెళ్లి దేవుడి ఎదుట ప్రమాణం చేశారు.

అర్చకుల వద్ద బండి సంజయ్‌ ప్రమాణం (Bandi Sanjay swears as God's witness) చేస్తూ.. నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి, తనకు గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫామ్‌హౌజ్‌ డీల్‌ తమది కాదని చెప్పేందుకే ప్రమాణం చేసినట్టు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఇక, బండి సంజయ్‌ యాదాద్రికి వచ్చిన క్రమంలో టీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు తెలిపారు. మరోవైపు తెలంగాణలో రెండు రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ (TRS) ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్ల డీల్ కేసు అప్‌డేట్స్ , విచారణను వేగవంతం చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అంటూ బీజేపీ విమర్శలు, ధర్నాకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాకకు వ్యతిరేకంగా యాదగిరిట్టలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన వ్యక్తంచేశారు. బండి సంజయ్‌, రఘునందన్‌ రావు దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి గో బ్యాక్ బండి అంటూ నినాదాలు చేశారు. చేశారు. బండి సంజయ్‌ యాదాద్రి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆగ్రహం వక్యం చేశారు.స్వాములతో దొంగ పనులు చేయించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీ నాయకులు యాదాద్రి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేస్తామనడం సిగ్గు చెటన్నారు.

దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోదీ యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయలేదని యాదాద్రీశుని పాదాల వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.