Cold Wave in Telangana: తెలంగాణలో మరో వారం రోజుల పాటు చలి డేంజర్‌బెల్స్, వృద్ధులు,చిన్న పిల్లలు,ఆస్తమా పేషెంట్లు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు
తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.గత వారం రోజులు నుంచి వణికిస్తున్న చలి ఈ రోజు తీవ్ర రూపం దాల్చింది. మధ్యాహ్నం వరకు చలి పంజా విసురుతుండగా సాయంత్రం 5 గంటల నుంచే మళ్లీ క్రమంగా పెరుగుతోంది.
Hyd, Dec 8: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా (Biting cold wave to grip Telangana) విసురుతోంది. తుఫాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.గత వారం రోజులు నుంచి వణికిస్తున్న చలి ఈ రోజు తీవ్ర రూపం దాల్చింది. మధ్యాహ్నం వరకు చలి పంజా విసురుతుండగా సాయంత్రం 5 గంటల నుంచే మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఉదయం వేళలో అయితే ప్రధాన రహదారులను పొగమంచు కప్పేస్తోంది.
మంగళ, బుధవారాలతో పోలిస్తే.. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోయాయి. హైదరాబాదులో నమోదైన టెంపరేచర్ సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదైంది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డిల్లో చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా పేషెంట్లు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున్న అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వారం పాటు (Continue for next few days) అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అదిలాబాదు జిల్లా నేరడి గోండలో 10.3. డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ యులో 10.6 డిగ్రీలు, కెరిమెరిలో 10.7డిగ్రీలు, ఉట్నూర్ లో 10.8 డిగ్రీలు, బోరజ్ 11.1 డిగ్రీలు, కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని 11.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారం11.2 డిగ్రీలు నమోదు అయ్యాయి.