Peddapalli MP Venkatesh: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ మిస్సింగ్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు, పెద్దపల్లి ఎంపీ ఫోటోను పట్టుకుని బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీ
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ (Peddapalli MP Venkatesh) ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు (BJP leaders complaint) చేశారు.
Peddapalli, April 10: పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కనిపించడం లేదంటూ బీజేపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ (Peddapalli MP Venkatesh) ఫొటోను పట్టుకుని బీజేపీ, బీజేవైఎం నాయకులు బెల్లంపల్లి చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి మంచిర్యాల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు (BJP leaders complaint) చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెద్దపల్లి ఎంపీ ఫోటోను పట్టుకుని ఎవరిని అడిగినా ఆయన కనిపించడం లేదనే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
పెద్దపల్లి ఎంపీ ఫొటోను పట్టుకుని అన్ని షాపులు, ప్రజలను కనిపించారా..? అని ప్రశ్నిస్తే కనబడలేదనే సమాధానం చెప్పారని, ఎంపీగా గెలిచినప్పటినుంచి జిల్లాలో అప్పుడప్పుడు పర్యటించడమే తప్ప ప్రజల వద్దకు వెళ్లడంగానీ, ప్రజా సమస్యలపైన తెలుసుకునే ప్రయత్నంగానీ చేయడం లేదన్నారు.
ఎంపీగా గెలిచినప్పటినుంచి జిల్లాలో అప్పుడప్పుడు పర్యటించడమే తప్ప వెంకటేశ్ ప్రజల్లో తిరగడం గానీ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం గానీ చేయలేదని ఆంజనేయులు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేసి అంచలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగితే, వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేసి ఎంపీగా గెలిచారని విమర్శించారు.
కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ని నోటికొచ్చి తిట్టిన వెంకటేష్.. ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతూ కేసీఆర్‌పై ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సమస్యలపై కేసీఆర్‌తో మాట్లాడాలని, దళితుడిని ముఖ్యమంత్రిని చేసేలా నిలదీయాలని సవాల్ చేశారు.