HarishRao about Party Defections:ఆ ఎమ్మెల్యేలను మాజీలు చేసే వరకు నిద్రపోం.. పార్టీ మారిన వారికి హరీష్‌ హెచ్చరిక

పటాన్‌చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు

HarishRao about Party Defections(Harishrao FB)

Hyd, July 16:  బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మాజీలుగా చేసే వరకు నిద్రపోమని స్పష్టం చేశారు మాజీమంత్రి హరీష్‌ రావు. పటాన్‌చెరులో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు...గూడెం మహిపాల్ రెడ్డి పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని... పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం అని తేల్చిచెప్పారు.

2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని అప్పుడు కూడా ఇలాంటి కుట్రలే జరిగాయన్నారు. నాడు వైఎస్ హయాంలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే అంతకు రెట్టించిన ఉత్సాహంతో పోరాటం చేశామని గుర్తు చేశారు హరీష్‌. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడా రాష్ట్రాన్ని సాధించారని..

బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనన్నవాళ్లు తర్వాత కనిపించకుండాపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీకి కష్టాలు వస్తాయి...కానీ ధైర్యం కొల్పోవద్దన్నారు హరీష్ రావు. కార్యకర్తల్ని కాపాడే బాధ్యత తాను తీసుకుంటానని..ఓ ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు. పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని ఆత్మవిశ్వాసం నింపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పటాన్‌చెరులో మళ్లీ ఎగిరేది గులాబి జెండానే అన్నారు. మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు. పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చాం... రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించాం. నిధులు వరద పారించాం అన్నారు హరీష్.

మహిపాల్‌ రెడ్డికి మూడుసార్లు టికెట్లిచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసెలా వచ్చిందో? చెప్పాలన్నారు హరీష్. వైసీపీ నీకు టికెట్ ఇవ్వకపోతే తల్లిలా దగ్గరికి తీసుకుని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ కాదా ఆలోచించాలన్నారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుందాం.... మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు . కేసీఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటున్నారని...పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ తనే ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాలుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ..భవిష్యత్‌లో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన తనను కలచివేసిందని.. వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. 

జీవోలో రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ అని చెప్పారు. వ్యతిరేకత వస్తోందని మాట మార్చుతున్నారన్నారు. పాస్ బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటతో చెప్తున్నావు. అదే నిజమైతే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. వడ్లకు బోనస్ అని తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటూ 90 శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టావు.

ఇప్పుడు రుణ మాఫీ విషయంలోనూ అదే చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని చెప్పిన హరీష్‌... ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ సరిగ్గా అమలు కాలేదు... బస్సు తప్ప అంతా తుస్సే. ఆ బస్సులోనూ లొల్లులే అని నవ్వులు పూయించారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయి... ఇప్పట్నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు హరీష్.