Hyd, July 17: కిరాతకంగా కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తలరించగా విహాన్ మృతి చెందాడు.
వరంగల్‌లో ఓ వృద్దుడిపై కూడా దాడి చేశాయి కుక్కలు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగెలలో ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్(7) బాలుడిపై దాడి చేశాయి కుక్కలు. తీవ్ర గాయాలు కాగాకుటుంబ సభ్యులు ఆ బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స అందుతోంది. ఒకేరోజు మూడు సంఘటనలు చోటు చేసుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
బాలుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ ..భవిష్యత్‌లో ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన తనను కలచివేసిందని.. వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు.
చిన్నారులపై కుక్కల దాడులకు సంబంధించి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.