Singireddy Niranjan Reddy: బండి సంజయ్...కేంద్ర సహాయమంత్రా?..సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా?,రేవంత్ కుర్చి గురించి నీకెందుకు బాధని మండిపడ్డ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి.
Hyd, Oct 19: బండి సంజయ్...కేంద్ర సహాయ మంత్రా ?, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా ? చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి.
ఎన్నికలకు ముందు నిరుద్యోగుల సమస్యలపై ఒంటి కాలి మీద లేచిన బండి సంజయ్ ఇప్పుడెందుకు గర్జించడం లేదు ? అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగుల మీద లాఠీఛార్జ్ చేస్తుంటే రాష్ట్రం నుండి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ కి కనపడడం లేదా ? చెప్పాలన్నారు. అశోక్ నగర్ లో అప్రకటిత కర్ఫూ కొనసాగుతుంటే బీజేపీ నేతలు ఎందుకు కిక్కురుమనడం లేదు ?, మూసీ బాధితులు నెత్తి నోరు బాదుకుంటుంటే బీజేపీ నేతలలో చలనం ఎందుకు లేదు ? అన్నారు.
అవసరం అయితే అశోక్ నగర్ వెళ్తా అంటున్న బండి సంజయ్ మాటల వెనక మర్మం ఏంటి ? ఇప్పుడు ఓట్ల అవసరం లేదనా ? ఓట్ల అవసరం ఉన్నప్పుడు వస్తా అన్నట్లా ?...రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలన నడుస్తుంది .. రేవంత్ ప్రభుత్వానికి బీజేపీ నేతలు భేషరతుగా అనధికారిక మద్దతు ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏంటీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ? పరీక్షను వాయిదా వేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది దేశంలో కుస్తీ .. తెలంగాణలో దోస్తీ అన్నట్లు ఉందని..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏంటి ? ఊడితే ఏంటి ? చెప్పాలన్నారు. రేవంత్ సీఎం సీటులో ఉంటే ఏంటి ? ఉండకపోతే ఏంటి ?..రేవంత్ కు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్న కాంగ్రెస్ నేతలు ఎవరు ? రేవంత్ ను దించబోయే కాంగ్రెస్ మంత్రులు ఎవరో కూడా బండి సంజయ్ వెల్లడిస్తే బాగుండేది అన్నారు. మూసీ ప్రజల గోడు బీజేపీ నేతలకు పట్టదా ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఏ విధంగా వ్యాఖ్యానిస్తారో చెప్పాలన్నారు.