KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.

BRS President KCR extends New Year greetings(X)

Hyd, January 1: నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.

2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని అన్నారు. వీడియో ఇదిగో, ప్రజావాణిలో అర్ధ నగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త, ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని నిరసన 

నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...ఇవాళ తెలంగాణ భవన్ లో ఉదయం 11 గం.లకు 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement