CM KCR Speech in Praja Ashirvada Sabha: ఆనాడు జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా ఏ సీఎం సాయం చేయలేదు, ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో , పార్టీ తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన , ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు

CM KCR (Photo/x/TS CMO)

Hyd, Oct 18: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో , పార్టీ తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో ఏర్పాటు చేసిన , ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జడ్చర్లను ఐటీ హబ్‌, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

‘మహబూబ్‌నగర్‌లో అంబలి కేంద్రాలు పెడుతుంటే చూసి దుఃఖం వచ్చేది. నేను మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించాం. కొందరు పాలకులు పాలమూరును దత్తత తీసుకున్నారు కానీ.. చేసిందేమీ లేదు. కృష్ణా జలాల్లో మన హక్కు సాధించడం కోసం ఎంతో పోరాటం చేశాం. పాలమూరు ఎత్తిపోతల పథకం సోర్సును శ్రీశైలం నుంచి తీసుకున్నాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి జలాలు తీసుకోవాలని కొందరు చెప్పారు. 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి నీరు తీసుకుంటే మనకు సరిపోతాయా? ఇప్పుడు కూడా కొందరు నేతలు అలాంటి సలహాలే ఇస్తున్నారు.

రాజకీయంగా నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చాం, కాని ఇప్పుడు కేసీఆర్ మీ ఆశలు ఆవిరి చేశాడు, కాంగ్రెస్‌ విజయభేరి సభలో గర్జించిన ప్రియాంకా గాంధీ

పాలమూరూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేసులు వేశారన్నారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు వస్తున్నాయన్నాయని తెలిపారు. మొన్ననే పాలమూరు పథకాన్ని ప్రారంభించానని, టన్నెల్స్‌ పూర్తయ్యాయి. మోటర్లను బిగిస్తున్నారని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50 ఎకరాలను సాగునీళ్లు అందివ్వనున్నట్లు తెలిపారు.

ఉన్న తెలంగాణను పోగొట్టింది కూడా కాంగ్రెస్‌ పార్టీయే. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు.. పోరాటం చేసి సాధించుకున్నాం. చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించా. 9ఏళ్ల పోరాటం తర్వాత పాలమూరుకు అనుమతులు వచ్చాయి. నార్లాపూర్‌, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్లు, టన్నెల్స్‌ పూర్తయ్యాయి. మోటార్లు బిగిస్తున్నారు. రాబోయే 3..4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో బ్రహ్మాండంగా నీళ్లను చూడబోతున్నాం. పాలమూరులో కరవు అనేది పోతది. ఉద్దండాపూర్‌ ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. కరువు అనేది మనవైపు కన్నెత్తి కూడా చూడదు. పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రియాంక గాంధీ వాద్రా హామీ వీడియో ఇదిగో..

ఆనాడు తెలంగాణలో తాగు, సాగు నీరు లేదు, ప్రజలు వలస పోయారు. పాలమూరు వాసులు ఎంతో మంది ముంబయికి వలస వెళ్లారు. ఎక్కడో పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే.. అక్కడికి వెళ్లి నేను మాట్లాడాను. ఆనాడు ఉన్న సీఎంను జోలె పట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. అంటే అంత దుర్మార్గమైన పాలన కొనసాగింది. తెలంగాణ ప్రజలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతుంటే.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చెప్పారు. ఏం చేస్తారో చేసుకోండని తేల్చి చెప్పారు. ఆ సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. అలాంటి దుస్థితి మనది’’

‘ఇవాళ ప్రజా బలం, ఆశీర్వాదంతో తెలంగాణను అనేక రంగాల్లో నంబర్‌ 1గా నిలబెట్టుకున్నాం. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలోనూ మొదటి స్థానంలో ఉన్నాం. మిషన్‌ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇలా అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం. కులమతాలకు అతీతంగా పేదలందరినీ ఆదుకుంటున్నాం. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇచ్చిన ఘనత BRSకే దక్కుతుంది.

ఎప్పుడైనా రైతుబంధు లాంటి స్కీం విన్నామా?. కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం అంటారు. ఎన్నికల ముందు కర్ణాటకలో కాంగ్రెస్‌ 20 గంటలు కరెంట్‌ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు కర్ణాటక సీఎం 5 గంటల కరెంట్‌ ఇస్తాం సరిపెట్టుకోండని అన్నారు. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 24 గంటల కరెంట్‌ ఎందుకు? 3 గంటలు చాలన్నాడు.’ అంటూ కేసీఆర్‌ మండిపడ్డారు.

పదేళ్ల పాలనలో తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడొచ్చి కొంతమంది మాయమాటలు చెప్తారు. ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు ఇస్తారు. 50 ఏళ్లు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టిందెవరనే విషయాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి. మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

మేడ్చల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు ప్రతీ ఒక్కరూ నవ్వులాటగా చూసేవారని.. తెలంగాణ అయ్యేదా.. వచ్చేదా.. అని హేళనగా మాట్లాడారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇవాళ అదే తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. మేడ్చల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మేడ్చల్‌ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే.. మనం పోరాటం చేసి ఉండకపోతే మేడ్చల్‌ జిల్లా వచ్చేది కాదు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు చైతన్యవంతులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు వరకు దిక్కులేని స్థితిలో ఉన్నాం. నా మీద ఎన్నో నిందలు వేశారు.. అవమానించారు.. హేళనగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీల నేతలు ఉద్యమంలో నాతో కలిసిరాకపోయినా.. చాలా అవహేళనగా మాట్లాడారు. వాటిని దాటుకొని పోరాటం చేశాం. దాని ఫలితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం.

కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చామని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం లేక జూరాల నుంచి నీళ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశానని చెప్పారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరని ప్రశ్నించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now