KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

భూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు కేటీఆర్. రైతులు, వారి కుటుంబాలు భయపడకండి, మీ వెనుక కేసీఆర్ ఉన్నడు. న్యాయస్థానంలో కొట్లాడుదాం.. రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెబుదాం అన్నారు.

BRS Working President KTR Speech at Cherlapally Central Jail(X)

Hyd, Nov 23:  భూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు కేటీఆర్. రైతులు, వారి కుటుంబాలు భయపడకండి, మీ వెనుక కేసీఆర్ ఉన్నడు. న్యాయస్థానంలో కొట్లాడుదాం.. రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెబుదాం అన్నారు.

పేద, గిరిజన, బలహీనవర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి జైలు పాలైన మా నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో పరామర్శించాం అన్నారు. రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి కారణంగా చేయని తప్పుకు జైల్లో నరేందర్ రెడ్డి గారు శిక్ష అనుభవిస్తున్నారు... పట్నం నరేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన తన గురించి కాకుండా 30 మంది అమాయక రైతులను విడిపించండని చెప్పారు. అందుకు ఆయనకు అభినందనలు అన్నారు. కొడంగల్‌లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని అక్కరలేని ఫార్మా విలేజ్‌ను రుద్దుతున్నారు. వారికోసం పోరాటం చేయండని చెబుతూ బాధపడుతున్నారు... సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలు వరకు తప్పు చేయని అమాయకులు జైల్లో ఉన్నారు అన్నారు.

కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డి పల్లె వరకు అరాచకాలు చేస్తున్న దుర్మార్గులు గద్దెనెక్కి కూర్చున్నారు... కొడంగల్‌లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలు, పిల్లలపై అరాచకాలు చేస్తూ పేద రైతుల భూములు గుంజుకుంటున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై పగబట్టారు. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు... కానీ ఆయన ఇంటికి అడ్డంగా గోడకట్టి తోవ లేకుండా చేశారు. ఆ క్షోభ, అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు. నియంతలు, దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. గతంలో మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటి ఘటనల గురించి విన్నామా? చెప్పాలన్నారు.

సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నీ సామ్రాజ్యమా, నువ్వు చక్రవర్తివా? వెయ్యి ఏళ్లు బతకటానికి వచ్చావా?, సొంత ఊరు, సొంత నియోజకవర్గమైతే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు. నువ్వు నియంత కాదు. నువ్వు చక్రవర్తి కాదు. నీలాంటి వాళ్లు చాలా మంది కొట్టుకుపోయారు. నువ్వు కూడా కొట్టుకుపోతావ్ అన్నారు కేటీఆర్. శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు, రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు... భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద, గిరిజన రైతుల కుటుంబాల మీద అర్థరాత్రి బందిపోట్ల మాదిరిగా పోలీసులు దాడి చేస్తున్నారు అన్నారు.  మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి 

Here's Tweet:

అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ సాయిరెడ్డి, గురువా రెడ్డి లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేశారు... సొంత గ్రామంలో చేస్తున్న అరాచకాల పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. నీ కన్నా పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు... మా నేత నరేందర్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నాడు. పేదలు, గిరిజన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరాడు అన్నారు. మహబూబాబాద్‌లో మేము చేపట్టనున్న ధర్నా బాగా చేయాలంటూ మాకు ఉత్సాహానిచ్చారు... నరేందర్ రెడ్డికి, చేయని తప్పునకు జైల్లో ఉన్న 30 మంది అమాయక రైతుల కుటుంబాలకు ఒకటే చెబుతున్నాం... మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నాలుగు రోజులు జైల్లో పెట్టవచ్చు. కానీ ఆయనకు మళ్లీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉందన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana Temperatures: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు, భద్రాచలంలో అత్యధికంగా టెంపరేచర్ నమోదు, మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి

Amit Shah Slams MK Stalin: సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో అందరూ అవినీతిపరులే, ఈ సారి తమిళనాడులో వచ్చేది ఎన్టీఏ ప్రభుత్వమే, డీఎంకే సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ

Liquor Shops Closed in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి 3 రోజులు పాటు హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్, ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

Share Now