Hyd, Nov 23: మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.
తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని...ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉందని చెప్పారు బండి. అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్
Here's Tweet:
మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసింది, ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత : బండి సంజయ్..
రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది..
తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుంది
మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయి..
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్… pic.twitter.com/sA3FMgfOxl
— Telangana Awaaz (@telanganaawaaz) November 23, 2024
ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధిస్తే ఈ సారి సగానికి పైగా పడిపోయింది కాంగ్రెస్. అగ్రనేతలంతా అక్కడ ప్రచారం చేసిన మరాఠీలు ఆదరించలేదు.
ప్రస్తుతం కేవలం 20 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసిన చోట చిత్తుగా ఓడిపోయింది ఆ పార్టీ. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రచారం కలిసొస్తుందని భావించింది కాంగ్రెస్ హైకమాండ్.అయితే తెలుగువారిపై రేవంత్, మంత్రుల ప్రచారం ఏ మాత్రం కలిసిరాలేదు.