IPL Auction 2025 Live

HYD Car Accident Video: ఒళ్లు గగుర్పొడిచేలా సీసీ పుటేజీ వీడియో, హైదరాబాద్‌లో బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం, మహిళ అక్కడికక్కడే మృతి, ఆరుగురుకి తీవ్రగాయాలు

ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడింది. ఆ సమయంలో అక్కడే ఆటోకోసం వేచి చూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన మహిళ సత్యవేణిగా గుర్తించారు.ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు.

car-fell-down-from-flyover-near-biodiversity-hyderabad-one-dead (Photo-Twitter)

Hyderabad, November 23: తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌ (Biodiversity flyover)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడింది. ఆ సమయంలో అక్కడే ఆటోకోసం వేచి చూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన మహిళ సత్యవేణిగా గుర్తించారు.ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు.

దీంతో గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. కింద ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడినట్లు చెబుతున్నారు. వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెండో ప్రమాదం జరిగింది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

CCTV footage

మరోవైపు కారు ప్రమాదంతో బయో డైవర్శిటీ వద్ద విసాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదస్థలంలో చెట్లు విరిగిపడ్డాయి.‌కారుతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంతో బయో డైవర్శిటీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్లడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఈ వారంలో వరుసగా రెండో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా (HYD Car Accident Bizzare Video) ఉంది.

CCTV footage

మరోవైపు ఈ ప్రమాదంపైమేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వేగాన్ని నియంత్రించేందుకు చేపట్టే చర్యల కోసం మూడు రోజులపాటు రాకపోకలు నిలిపి వేశారు.