Celebs Pay Tribute To Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు ప్రముఖుల నివాళి, గొప్ప గురువును కొల్పోయాను అన్న రాహుల్..మన్మోహన్ సేవలు చిరస్మరణీయం అన్న ఏపీ సీఎం
గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Delhi ,December 27: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స పొందుతూ మృతి చెందారు మన్మోహన్. మన్మోహన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రేపు మన్మోహన్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనుండగా 7 రోజుల పాటు సంతాప దినాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు మన్మోహన్. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలను తన నాయకత్వంలో నడిపించారు మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన రాజకీయ దురంధరుడు
()దేశం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయింది - ప్రధాని మోదీ
()ఒక గొప్ప గురువును కోల్పోయాను- ఎంపీ రాహుల్ గాంధీ
()మన్మోహన్ సింగ్ నిజాయితీ తరతరాలకు ఆదర్శం- ఎంపీ ప్రియాంక గాంధీ
()దేశం ఇప్పటివరకు సృష్టించిన రాజనీతిజ్ఞులలో మన్మోహన్ సింగ్ ఒకరు - మెగాస్టార్ చిరంజీవి
Celebs pay tribute to Manmohan Singh
()మన్మోహన్ సింగ్ మృతి ఈ దేశానికి తీరని లోటు - సీఎం రేవంత్ రెడ్డి
()భారత దేశ అభివృద్ధిలో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేం- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
()దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం- సీఎం చంద్రబాబు