IPS & IAS Transfer Row: డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ, ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంపై హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల విచారణను అ‍త్యవసరంగా చేపట్టాలంటూ కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్‌ 5వ తేదీన ఈ అంశంపై విచారిస్తామని హైకోర్టు స్పష్టం​ చేసింది

High Court of Telangana | (Photo-ANI)

Hyd, April 12: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల అంశంపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల విచారణను అ‍త్యవసరంగా చేపట్టాలంటూ కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్‌ 5వ తేదీన ఈ అంశంపై విచారిస్తామని హైకోర్టు స్పష్టం​ చేసింది.రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులను కేంద్రం.. ఏపీ, తెలంగాణకు కేటాయించింది.

హైదరాబాద్‌లో ఇళ్ల మీది నుంచి నీళ్లు పోతున్నాయి, నువ్వా మా ఏపీ గురించి మాట్లాడేది, హరీష్ రావుకు కౌంటర్ విసిరిన వైసీపీ నేతలు

అయితే, కేంద్ర ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించి అధికారులు ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్‌ ఉత్తర్వులపై కేంద్రం.. హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్‌ కుమార్‌ ఏపీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టు అదేశంతో IAS అధికారి సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement