Telangana: తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్, రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్, ఎన్నిక‌ల ముందు రైతుల‌కు బిగ్ రిలీఫ్

అంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ ( Rythubandhu Distribution)చేసేందుకు అనుమతి ఇచ్చింది.

Election Commission of India. (Photo Credit: Twitter)

Hyderabad, NOV 24: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections) మరో వారం కూడా లేవు. అంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రైతుబంధు పంపిణీ ( Rythubandhu Distribution)చేసేందుకు అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి ప్రభత్వ పథకాలు అమలులో ఉండవు. అందులో భాగంగానే మొదట రైతుబంధును నిలిపివేసినప్పటికీ.. తాజాగా పంపిణీకి అనుమతి లభించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ విజ్ణప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 7వేల కోట్ల రూపాయల నిధులను దశల వారీగా రైతుబంధులో వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనుంది.

KCR Parade Ground Meeting Postponed: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ వాయిదా.. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కారణంగానే నిర్ణయం

ఇక ఎన్నికల ప్రచారానికి ఈ నెల 28 వరకు సమయం ఉంది. అయితే దీనికి ముందే రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్, బీజేపీలు దీన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ణప్తి చేశాయి. రాష్ట్రంలో అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీదారుగా ఉంది. ఇక బీజేపీ, బీఎస్పీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది.