Hyderabad Shocker: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టు, ఇప్పటికే 20 మందికి ఫేక్‌ సర్టిఫికెట్లు, విదేశాల్లో సైతం పట్టుబడ్డ పలువురు విద్యార్థులు

జేఎన్‌టీయూ, కాకతీయ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలైన ఎంఎస్‌ రామయ్య యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ల పేర్లతో నకిలీ డిప్లొమా సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Representative Image

ఫేక్ సర్టిపికేట్ల రాకెట్ ను గుర్తించిన హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. జేఎన్‌టీయూ, కాకతీయ, ఆచార్య నాగార్జున యూనివర్శిటీతో పాటు ఇతర రాష్ట్రాల విద్యాసంస్థలైన ఎంఎస్‌ రామయ్య యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ల పేర్లతో నకిలీ డిప్లొమా సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక టెక్నికల్ రిక్రూటర్ గ్రాడ్యుయేషన్ కోసం తన వీసాను ప్రాసెస్ చేయమని చైతన్యపురిలోని ఎస్ లక్ష్మీస్ ఎస్‌ఎల్ ఓవర్సీస్ కంపెనీని కోరినప్పుడు, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ ప్రారంభించిన పోలీసులకు నలుగురు నిందితులు పట్టుబడ్డారు.

UK Covid Cases: బ్రిటన్‌ లో కరోనా 5 వేవ్, రోజుకు 3లక్షలకు పైగా కరోనా కేసులు, అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం, కలకలం సృష్టిస్తున్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ట్వీట్, పేషెంట్లతో నిండిపోతున్న ఆస్పత్రులు 

రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలని కలలు కనే విద్యార్థులనే ఈ రాకెట్ లక్ష్యంగా చేసుకుంది. పేరున్న యూనివర్సిటీల పేరుతో విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు అందజేస్తోంది. నిజానికి కొన్ని యూనివర్సిటీలు అసలు మనుగడలోనే లేవు. ఒక నకిలీ సర్టిఫికేట్ అందించినందుకు ముఠా రూ. 1 లక్ష వసూలు చేస్తుందని తెలిపారు. అనేక మంది విద్యార్థులు పట్టుబడక ముందే ఒకేలాంటి ఆధారాలతో జర్మనీకి వెళ్లినట్లు చెబుతున్నారు. కన్సల్టెన్సీ నుండి నకిలీ ధృవీకరణ పత్రాలు పొంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారిని, అలాగే విదేశాలకు వెళ్లిన విద్యార్థులను పోలీసులు ఇప్పుడు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.