COVID-19 Outbreak in India | File Photo

Paris, July 04: కరోనా (Corona)తీవ్రత తగ్గిందని...కరోనా ఇక పోయిందని, మళ్లీ రాదు అని అంతా అనుకున్నారు. కొన్ని దేశాల్లో మాస్క్ (Mask)లు కూడా తీసేశారు. కానీ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొన్ని దేశాల్లో వైరస్ విజృంభణ ఎవరికీ అంతు చిక్కడం లేదు. గడిచిన రెండేళ్లలో పట్టి పీడించిన దేశాల్లోనే మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. బ్రిటన్ లో (Britain) మళ్లీ మహమ్మారి విజృంభిస్తోంది. ఆ దేశంలో కరోనా కేసులు సునామీని తలపిస్తున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నట్లు అంచనా. అధికారికంగా ప్రభుత్వం నుంచి రోజువారి కేసుల సంఖ్య అయితే రిలీజ్ అవడం లేదు కానీ, రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు టిమ్ (Tim) అనే ప్రొఫెసర్ చేసిన ట్వీట్ తో యూకే ఒక్కసారిగా షేక్ అయ్యింది.

రోజుకు సగటున మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయని, బ్రిటన్ లో ఫిఫ్త్ వేవ్ (Fifth Wave) మొదలైపోయినట్లు ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఆసుపత్రిలో చేరికల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. మరోవైపు బ్రిటన్ ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాట్స్ విడుదల చేసిన గణాంకాల్లో కూడా దాదాపుగా ఇదే రకమైన పెరుగుదల కనిపిస్తోంది.

Corona Update: భారత్‌లో ఫోర్త్ వేవ్, 8 వేల మార్క్ దాటిన కేసులు, కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్న కేంద్రం

బ్రిటన్‌ లో గతంలో కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున మరణాలు రికార్డయ్యాయి. వ్యాక్సినేషన్ లో కూడా బ్రిటన్ దాదాపు ముందుంది. అయినప్పటికీ కేసుల తీవ్రత తగ్గడం లేదు. అయితే బ్రిటన్‌ లో తాజా కేసులతో ఆస్పత్రులు ఫుల్ అవుతున్నాయి. దీంతో మెడికల్ టీమ్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం అధికారికంగా కేసుల సంఖ్యను ప్రకటించకపోయినప్పటికీ....ప్రొఫెసర్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.