Chikkadpally SIs Suspended: విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, చిక్కడపల్లి సీఐ, ఎస్ఐతో పాటు సీసీఎస్‌ ఎస్ఐ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన సీపీ అంజనీకుమార్

చిక్కడపల్లిలో పీఎస్​లో సీఐగా పనిచేస్తున్న పాలడగు శివశంకర్ రావు, అశోక్ నగర్ సెక్టార్ ఎస్ఐ నర్సింగ్ రావు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్​లో ఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు గౌడ్ ఈ ముగ్గురు ఓ కేసులో ఫిర్యాదుదారుడితో దురుసుగా ప్రవర్తించారు.

CP Anjani kumar (Photo-Twitter)

Hyd, Nov 24: విధుల్లో నిర్లక్ష్యం వహించిన చిక్కడపల్లి సీఐ, ఎస్ఐతో పాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్​లో పనిచేస్తున్న ఎస్ఐ సస్పెండ్ (Chikkadpally SIs Suspended) అయ్యారు. చిక్కడపల్లిలో పీఎస్​లో సీఐగా పనిచేస్తున్న పాలడగు శివశంకర్ రావు, అశోక్ నగర్ సెక్టార్ ఎస్ఐ నర్సింగ్ రావు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్​లో ఎస్ఐగా పనిచేస్తున్న నాగరాజు గౌడ్ ఈ ముగ్గురు ఓ కేసులో ఫిర్యాదుదారుడితో దురుసుగా ప్రవర్తించారు.

దీనిపై విచారణకు ఆదేశించిన సీపీ అంజనీకుమార్.. ఈ ముగ్గురు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, అవినీతి, నైతిక అస్థిరత ఫిర్యాదుదారుడిని బెదిరించినందుకు చిక్కడపల్లి సీఐ పాలడుగు శివశంకర్‌రావు, ఎస్‌ఐ నర్సింగరావులను సస్పెండ్‌ (two SIs, SHO suspended in Hyderabad) చేసినట్లు సమాచారం.

గత వారం చిక్కడపల్లి పీఎస్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులను సీసీఎస్‌కు వెళ్లాలని.. కేసు నమోదులో తాత్సారం చేసినట్లు తెలిసింది. బాధితులు నేరుగా సీపీని కలిసి గోడు వినిపించడంతో ఆయన విచారణ జరిపినట్లు సమాచారం.

తెలంగాణలో ఇంటర్ స్పెషల్‌ ఎగ్జామ్స్‌ ఉండవు, వార్షిక పరీక్షలప్పుడే విద్యార్థులందరికీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌

అయితే దీని వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని డీసీ పత్రిక తెలిపింది. సీసీఎస్‌ ఎస్‌ఐ నాగరాజ్‌గౌడ్‌ గతంలో తన బ్యాచ్ మేట్ అయిన ఓ మహిళతో ప్రేమ వ్యవహారం నడిపాడని ఈ కథనంలో తెలిపారు. “గత సంవత్సరం ఆగస్టులో ఆ మహిళ మరొక వ్యక్తిని వివాహం చేసుకోవడంతో వారు తమ ప్రేమ సంబంధాన్ని ముగించారు. ఆ తర్వాత తన భార్య ఫోన్‌లో గౌడ్‌, అతడి భార్య ఫొటో కనిపించింది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.

ఈ వ్యవహారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరింది. అప్పటి నుంచి ఎస్‌హెచ్‌ఓ శివశంకర్‌రావు ఇరువర్గాల మధ్య చర్చలు జరిపారు. అయితే దీనిని పరిష్కరించేందుకు భారీ స్థాయిలో లంచం డిమాండ్ చేయడంతో భర్త నగర పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఈ విషయం తేల్చేందుకు ఎస్‌హెచ్‌ఓ తన నుంచి రూ.30 లక్షల నగదు డిమాండ్‌ చేశారని ఆరోపించారు. బాధితుడు చెప్పింది నిజమేనని తేలడంతో సీఐ, ఎస్‌ఐతో పాటు ఈ కేసుతో సంబంధమున్న సీసీఎస్‌ ఎస్‌ఐని కూడా సస్పెండ్‌ చేసినట్లు తెలిసింది.