Chiranjeevi Meets Venkaiah Naidu: ఒకే చోట కలిసిన పద్మవిభూషణులు, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి, స్వయంగా ఇంటికి వెళ్లి కలిసిన మెగాస్టార్
వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.
Hyderabad, JAN 26: రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. దీంట్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్(Padma Vibhushan) ని ప్రకటించారు. తెలుగు సీనియర్ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి, వెంకయ్యనాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు పర్సనల్ గా కలిసి సత్కరిస్తున్నారు.
అయితే ఈ సందర్భంగా ఈ ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం నాడు వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు. చిరంజీవి, వెంకయ్యనాయుడు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. సంతోషకరమైన క్షణాలను వెంకయ్యనాయుడు గారితో పంచుకున్నాను. ప్రతిష్టాత్మకమైన గౌరవం అందుకున్నందుకు తోటి గ్రహీతలుగా ఒకరినొకరు అభినందించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. దీంతో ఇద్దరు పద్మ విభూషణులు, తెలుగు వారికి గర్వకారణమైన ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫొటోలో ఉన్నారు అంటూ అభినందనలు కురిపిస్తూ ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు.