Class 10 Exam Pattern Revised: పదో తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు, తెలంగాణ సర్కారు తెచ్చిన కొత్త రూల్ ఇదే
టెన్త్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ లో (Tenth Exams) ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 శాతం మార్కులతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ పేర్కొంది.
Hyderabad, NOV 28: పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై టెన్త్ ఎగ్జామ్స్ లో (Tenth Exams) ఇంటర్నల్ మార్కులను ఎత్తివేసింది. మొత్తం 100 శాతం మార్కులతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ పేర్కొంది. ఇప్పటివరకు 20శాతం ఇంటర్నల్ మార్కులతో పరీక్షలు నిర్వహించేది విద్యాశాఖ. ఇప్పటివరకు 80 మార్కులకే టెన్త్ పరీక్ష పేపర్ ఉండేది. 20 శాతం ఇంటర్నల్ మార్కులు యాడ్ చేసే వారు. కాగా, గ్రేడింగ్ విధానంలో ఫలితాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో ఇంటర్నల్ మార్కుల అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇంటర్నల్ మార్కులు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. గతంలో టాప్ స్టూడెంట్ కు సంబంధించి ఇంటర్నల్ మార్కులకు కొంత ప్రాధాన్యం ఉండేది. ఏదైనా సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వస్తే ఇంటర్నల్ మార్కులు యాడ్ చేసే అవకాశం ఉండేది.
అయితే గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తుండటంతో ఇకపై ఇంటర్నల్ మార్కుల అవసరం లేదని విద్యాశాఖ ఒక రిపోర్టు ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రాబోతోంది.