CM KCR On Jobs: నిరుద్యోగుల‌కు కేసీఆర్ గుడ్‌న్యూస్, తెలంగాణలో 80 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన

80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం సభలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

CM KCR in Assembly (Photo-Twitter/TS CMO)

Hyd, March 09: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (CM KCR) తీపి క‌బురు అందించారు. 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం సభలో ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌తో ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. రేపు రాబోయే షెడ్యూల్ 9, 10 ఆ వివాదం పరిష్కారం అయితే అక్కడా అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణలో ఉద్యోగుల విభజన అయిన తర్వాత 91142 వేల ఖాళీలు ఏర్పడ్డాయి. వీటికి ఈరోజు నుంచే నోటిఫై చేస్తామన్నారు.

గతంలో హైకోర్టు 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తున్నం. మిగిలిన 80,039 ఉద్యోగాల భర్తీకి ఇవాళ్టి నుంచే సంబంధిత శాఖలు నోటిఫికేషన్లు ఇస్తాయని సీఎం స్పష్టం చేశారు. అత్యధికంగా విద్యారంగంలో 25-30 వేల ఉద్యోగాలు ఉన్నాయన్నారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీలను ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ, ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12 వరకు..

1990లో ముల్కీ నిబంధనలను జెంటిల్ మెన్ పేరిట రూల్స్ పెట్టి అన్యాయం చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగుల రూల్స్ ముల్కీ కంటే స్ట్రాంగ్ గా తేవాలని ఆలోచన చేసినం. అందులో భాగంగానే రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చినం. పక్కాగా ఉద్యోగ నియామకాలు జరగాలని కొంత ఆలస్యమైన ఆగాం.

1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం. అందులో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. మిగతా ఉద్యోగాల విషయంలో సర్వీసు రూల్స్ విషయంలో స్పష్టత కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు కోసం పంపాం. కానీ అక్కడా ఆలస్యం. తర్వాత తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి అధికారులను ఊరికించి ఉత్తర్వులు వచ్చేలా చేశాం.

95 శాతం ఉద్యోగాలు లోకల్స్ కి

ఇవాళ 95 శాతం ఉద్యోగాలు లోకల్స్ కి వస్తాయి. మిగతా వాటిల్లోనూ 2-3 శాతం లోకల్స్ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. అంటే 98 శాతం మనవాళ్లకే ఉద్యోగాలు వచ్చేలా నిబంధనలు తీసుకొచ్చాం. ఉద్యోగుల పంపకం, సీనియారిటీ అలకేషన్ చేసినాక ఇప్పుడు ఉద్యోగాలపై కొద్దిగా స్పష్టత వచ్చింది.

ఇదంతా ఇలా సాగుతోండగా.. మామీద కొందరు అవాకులు చేవాకులు పేలిండ్రు. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ఫలితాలు వస్తాయి. ఇనాడు తెలంగాణలో జీఎస్టీడీపీ ఎందుకు పెరిగింది. ఇక్కడ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అందుకే తమిళనాడు, మహారాష్ట్ర కంటే మనమే ముందున్నాం. కేంద్ర వ్యతిరేక వైఖరిని తట్టుకుని అభివృద్ధి సాధించాం.

22 వేల మంది ఎలక్ట్రికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినం. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం తమది. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను రద్దు చేసినం. దీనిపై పంచాయతీ చేసిండ్రు. అయినా ఊరుకోలేదు. ఇనాడు తెలంగాణ ఉద్యోగులకు దేశంలోనే ఎవరూ ఇయ్యని విధంగా జీతాలు ఇస్తున్నాం.’’ అని సీఎం అన్నారు.