Revanth Reddy on Ex DSP Nalini: మళ్లీ విధుల్లోకి మాజీ డీఎస్పీ నళిని, పోలీస్ శాఖలో వీలుకాకపోతే వేరేశాఖలో జాబ్ ఇవ్వాలంటూ సీఎం రేవంత్ నిర్ణయం

నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

CM Revanth Reddy (PIC@ X)

Hyderabad, DEC 15:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి (Ex DSP Nalini) పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth reddy) ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పోలీస్ శాఖలో నియామకాలపై సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

AP Cabinet Meeting Highlights: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం, పెన్షన్‌తో పాటు 45 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్, పూర్తి వివరాలు ఇవిగో.. 

ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చాలామంది తిరిగి ఉద్యొగాల్లో చేరిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే నియమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించిన నళినికి మాత్రం తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో అభ్యంతరాలు ఎందుకు ఉండాలని అన్నారు.

Don't Stop Traffic for Me: నా కాన్వాయ్‌ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు, పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని వెల్లడి 

తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు వచ్చినప్పుడు, నళినికి ఎందుకు అన్యాయం జరగాలని అన్నారు. తిరిగి ఉద్యోగంలో చేరడానికి నళిని సుముఖంగా ఉంటే, వెంటనే ఆమెకు ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.



సంబంధిత వార్తలు

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి